సూర్యాపేట(Suryapet)లో ప్రభుత్వ పాఠశాలకు భవన యజమాని తాళం వేశారు. చాలా కాలంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన అద్దె డబ్బులు అందకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి చాలా కాలంగా ప్రభుత్వం అద్దె చెల్లించలేదు. దీంతో యజమాని తాళం వేసి.. విద్యార్థులను, ఉపాధ్యాయులను లోపలికి అనుమతించలేదు. ఈ విషయం తెలిసిన అధికారులు అద్దె బకాయి నిజమేనని అంగీకరించి.. విద్యార్థులను హైస్కూల్ భవనంలోకి షిఫ్ట్ చేశారు.
Suryapet | కాగా ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల చదువులతో ఆటలేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ బడికి సొంత భవనం లేకపోవడం ఏంటని స్థానికులు అడుగుతున్నారు. ఇలా అద్దెలు కట్టలేదని స్కూల్లకు తాళాలు వేసేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ అద్దె బకాయి సమస్యలకు ప్రభుత్వ శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
Read Also: వాళ్లంతా మూర్ఖులు..: ట్రంప్
Follow Us on : Pinterest

