బుద్ధారం, కేశంపేట రైతులకు గుడ్ న్యూస్!

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) నియోజకవర్గంలోని బుద్ధారం, కేశంపేట గ్రామాల భూ నిర్వాసిత రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. భూసేకరణలో భూములు కోల్పోయి పరిహారం (Land Acquisition Compensation) కోసం ఎదురుచూస్తున్న రైతుల సమస్యను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.11 కోట్ల నష్టపరిహారం నిధులు మంజూరై, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.

పరిహారం అందేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. పరిహారం నిధులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పురుష ప్రభుత్వ ఉద్యోగులకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>