పురుష ప్రభుత్వ ఉద్యోగులకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) పురుష ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. భార్య డెలివరీ సమయంలో అండగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. భార్యకు తోడు ఉండేందుకు ప్రభుత్వ పురుష ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ లీవ్ (Paternity Leave) వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనుంది. విజయ్ సర్కార్ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులైన పురుషులు తమ భార్య ప్రసవానికి 15 రోజుల ముందు నుంచే సెలవులు తీసుకోవచ్చు.

అలాగే, బిడ్డ జన్మించిన 6 నెలల్లోపు ఈ 15 రోజులు వినియోగించుకునే అవకాశం ఉంది. భార్య ప్రసవ సమయంలో భర్త తోడుగా ఉండటంతో పాటు, నవజాత శిశువు సంరక్షణలో తండ్రి భాగస్వామ్యం పెంచాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : అరుదైన శస్త్రచికిత్స.. బాలుడి శరీరంలో గర్భాశయం తొలగింపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>