‘ఇందిరమ్మ బీమా’ను పకడ్బందీగా అమలు చేయాలి : వెంకటేశ్వర్లు

కలం, దస్తూరాబాద్/కడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు (Venkateshwarlu) ఆదేశించారు. గురువారం దస్తూరాబాద్, కడెం, రేవోజిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కేంద్రాలను ఆయన సందర్శించి, అక్కడ జరుగుతున్న నమోదు ప్రక్రియను పరిశీలించారు.

లబ్ధిదారుల వివరాల సేకరణ, దరఖాస్తుల స్వీకరణ, నమోదు విధానం తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన (Venkateshwarlu) మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుదారుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, నామినీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని, అర్హులైన వారు ఎవరూ పథకం ప్రయోజనాలకు దూరం కాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

అనంతరం దస్తూరాబాద్‌లో చేపట్టిన కార్మికుల సమీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. పథకానికి సంబంధించి అర్హులైన కార్మికులను గుర్తించి, వారికి పథకం ఉద్దేశం, ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తూ, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీఓ అరుణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>