మైత్రి అకాడమీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కలం, నల్గొండ: నల్గొండలోని మైత్రి అకాడమీలో (Mytri Academy Nalgonda) గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు భారత రాజ్యాంగ విశిష్టత, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాజ్యాంగ స్ఫూర్తిపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ ఆదర్శాలను రోజువారీ జీవితంలో ఆచరిస్తామని విద్యార్థులు ప్రతినబూనారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను భావితరాలకు అందించడంలో విద్యాసంస్థల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతోపాటు ఇతరుల హక్కులను గౌరవించాలని, బాధ్యతగల పౌరులుగా ఎదగాలని సూచించారు. కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో వివక్ష చూపకుండా ప్రతి వ్యక్తినీ సమాన గౌరవంతో చూడాలన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులు, పౌర బాధ్యతలపై విద్యార్థులు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆస్తుల సంరక్షణ, శాస్త్రీయ దృక్పథం, బాధ్యతాయుతమైన సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పించారు.

మైత్రి అకాడమీ చైర్మన్ పాముల అశోక్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక స్పృహ, ప్రజాస్వామ్య అవగాహన, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి విద్యార్థికి, వారి ద్వారా ప్రతి కుటుంబానికి చేరవేయడమే కార్యక్రమ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, మెరుగు మధు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టేకోలు దీపేందర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మకాల గిరిబాబు, అధ్యాపకులు సోమశేఖర్, లింగం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>