Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ మూవీ వివాదం.. సారీ చెప్పిన బుచ్చిబాబు

కలం, వెబ్ డెస్క్: పెద్ది (Peddi) చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పారు. చిత్రంలో ఉన్న అభ్యంతరకర, వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘దర్శకుడిగా సినిమా అనేది ప్రేక్షకులను అలరించి, స్ఫూర్తి నింపేలా, వారితో కనెక్ట్ అయ్యేలా ఉండాలని కోరుకుంటాను. అంతే తప్ప, ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, గౌరవానికి భంగం కలిగించడానికి కాదు. తెరపైనా, బయట నాకు మహిళలంటే అపారమైన గౌరవం, వారిని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు వారిని ఇబ్బంది పెట్టేలా ఉన్నట్లు నాకు తెలిసింది. దీనికి క్షమాపణలు చెబుతున్నా. మూవీని సమీక్షించాక, అలాంటి సీన్లను తొలగించాలని నిర్ణయించుకున్నా. సున్నితమైన అంశాల్లో సెంటిమెంట్లను పూర్తిగా గౌరవిస్తాను. ప్రతి మహిళకు గౌరవం దక్కాల్సిందే. ఇక నుంచి మేం అదే విలువలతో సినిమా కథలు చెప్పాలని బలంగా నిర్ణయించుకున్నాం. నిజాయతీగా మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.

నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతోనే..

పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో నటించింది. దీనిలో భాగంగా, కొన్ని అభ్యంతరకరమైన డైలాగ్స్‌ను జాన్వీ నోట వెంట పలికించారని.. దీన్ని సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతించిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని మండిపడుతున్నారు. అప్రమత్తమైన మూవీ మేకర్స్ వాటిని వెంటనే తొలగించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు. ఈ మేరకు మార్పులు చేర్పులు చేయబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>