టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. వైభవ్ వచ్చేశాడు

కలం, స్పోర్ట్స్: భారత టీ20 జట్టులో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌‌ను (Shreyas Iyer) బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని (Vaibhav Suryavanshi) కూడా జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు 2026 ఆసియా గేమ్స్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఆడబోతుంది. ఊహించినట్లుగానే పేలవ ఫామ్ కారణంగా సూర్య కుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌ కూడా జట్టుకు దూరమయ్యారు.

స్టార్ బౌలర్ బుమ్రా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎంపిక కాకపోయినా, ఆసియా గేమ్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రేయస్ (Shreyas Iyer) కెప్టెన్సీలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభించడం ఈసారి సెలెక్షన్ ప్రత్యేకతగా నిలిచింది. ఐపీఎల్‌లో పరుగుల మోత మోగించిన వైభవ్.. తన తొలి టీ20 సిరీస్‌ల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనే ఆసక్తి నెలకొంది.

ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు భారత జట్టు..

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

2026 ఆసియా గేమ్స్‌కు భారత జట్టు..

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

Read Also: నార్వే చెస్ 2026 ఛాంపియన్ ప్రజ్ఞానంద..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>