Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటర్‌బోర్డును ముట్టడించిన BRSV నాయకులు.. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్‌ఎస్‌వీ (BRSV) నాయకులు గురువారం ఇంటర్‌ బోర్డు (Intermediate Board) కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌వీ నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని బీఆర్ఎస్‌వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>