కలం, కరీంనగర్ బ్యూరో: ఎట్టకేలకు కరీంనగర్ (Karimnagar) వ్యవసాయ మార్కెట్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అకుల నర్సయ్య, వైస్ చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్ నియమితులయ్యారు. మార్కెట్ కమిటీ సభ్యులుగా పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేణి సంపత్, కసవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాధుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్‌ను నియమించారు. అదేవిధంగా కరీంనగర్ పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ పాలవర్గ నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంలో కీలక పాత్ర పోషించిన సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి రాజేందర్ రావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలకవర్గం పనిచేయాలని రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కెట్ కమిటీ కమిటీగా తీర్చిదిద్దాలని రాజేందర్ రావ్ సూచించారు.
నిరంతరం రైతుల సేవకే ప్రాధాన్యం..
రైతుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని, కరీంనగర్ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు తో పాటు ముఖ్య కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నిత్యం రైతుల సంక్షేమానికి పాటుపడతానని రైతుల సేవలో తరిస్తానని స్పష్టం చేశారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని ఆకుల నరసయ్య పేర్కొన్నారు. పంటల సాగు నుంచి దిగుబడి ఇంటికి చేరి మద్దతు ధర వచ్చేవరకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
నూతన చైర్మన్ కు అభినందనల వెల్లువ
మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియామకమైన ఆకుల నరసయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. కాగా, ఆకుల నరసయ్య 1996లో సుల్తానాబాద్ సింగిల్ విండో డైరెక్టర్ గా వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2005లో సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. టిడిపి యువత నాయకుడిగా వ్యవహరించారు. 2005లో కరీంనగర్లో కార్పొరేటర్ గా పోటీ చేశారు. 2019లో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా నరసయ్య సతీమణి ఆకుల నర్మద గెలుపొందారు. రెండవసారి 2026లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నరసయ్య సతీమణి ఆకుల నర్మద కార్పొరేటర్ గా విజయం సాధించారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఆకుల నర్మద పోటీ చేశారు. మొదటి నుంచి ఆకుల నరసయ్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రైతుల కష్టాలను దగ్గర నుండి చూసిన వ్యక్తి ఆకుల నరసయ్య. రైతు సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రైతులకు అనేక సేవలందించారు. రైతు సమస్యలపై లోతైన అవగాహన ఉన్న నేతగా పేరుగాంచారు. సహకార సంఘం డైరెక్టర్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆకుల నరసయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించింది.

