రేవంత్ సర్కార్‌పై ఫైర్.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1000 రోజులు గడుస్తున్న సందర్భంగా రేవంత్ సర్కార్ పాలనపై బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 1000 రోజులు గడుస్తున్నాయని.. ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు సన్నద్ధమైంది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ  సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ‘బాకీ కార్డుల’తో రేవంత్ సర్కార్ హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను గ్రామగ్రామాన ప్రజలకు తెలియజెప్పాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>