Mobile Popup Ad
Mobile Popup Ad

మెదక్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడి

కలం, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలో అర్దరాత్రి కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. 15వ వార్డులో డబ్బులు పంచుచుతున్నారని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య  ఘర్షణతో అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది.

అదే సమయంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ (Mynampally Rohit) రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాన్వాయ్ ను అడ్డుకొని రాళ్ళతో దాడి చేసారు. అర్థరాత్రి పూట వార్డుల్లోకి ఎమ్మెల్యే రావాల్సిన అవసరం ఏంటని.. డబ్బులు పంచడానికే కారులో వచ్చాడని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి సంఘటనలో 30 మంది బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

Read Also: మున్సిపాలిటీలకు నిధులిచ్చేది కేంద్రమే : కిషన్​ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>