కలం, వెబ్ డెస్క్ : మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘మోడీ వచ్చి మోరీలు శుభ్రం చేస్తారా అంటూ సీఎం రేవంత్ అడుగుతున్నారు. మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మోరీలు ఊడుస్తారా చేస్తారా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ‘నా పేరును సీఎం మార్చి పిలుస్తున్నారు. నా తల్లిపెట్టిన పేరును మార్చడానికి ఆయన ఎవరు. రేవంత్ రెడ్డి తన పేరును రేవంత్ ఖాన్ అని మార్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఎంఐఎంతో కాపురం చేస్తున్నన్ని రోజులు.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు పోస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతోంది : బాంబు పేల్చిన పొంగులేటి
Follow Us On: X(Twitter)


