కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి (Kyathanpalli) మున్సిపాలిటీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి ఊహించని ఎదురుదెబ్బను మిగిల్చాయి. మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ద్వారా తన పట్టును నిరూపించుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గొడిసల సంధ్యారాణి ఛైర్మెన్‌గా విజయం సాధించారు.
మరో ఆసక్తికర పరిణామంలో, వైస్ చైర్మన్ పదవిని సీపీఐ అభ్యర్థి మిట్టపల్లి సరిత దక్కించుకున్నారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి ఇలాకాలోనే ప్రతిపక్షాలు పైచేయి సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం కనిపిస్తుండగా, బీఆర్ఎస్, సీపీఐ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. స్థానిక సమీకరణాలు, పొత్తులు ఈ విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

