Mobile Popup Ad
Mobile Popup Ad

గజ్వేల్‌లో టెన్షన్.. టెన్షన్: కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో రేవంత్ ఫొటో!

కలం, మెదక్ బ్యూరో : గజ్వేల్ (Gajwel) లోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (KCR Camp Office)పై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గజ్వేల్ శివారులో ఉన్న ఈ కార్యాలయ కిటికీ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా వెళ్లి కార్యాలయంలో ఆ ఫోటోను ఉంచారు.

అయితే కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలుస్తోంది. తాము కేవలం ముఖ్యమంత్రి ఫోటోను మాత్రమే అక్కడ ఉంచామని, దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>