epaper
Wednesday, February 18, 2026
epaper

తొర్రూర్​లో కాంగ్రెస్​ ఓటమికి కారణం అదేనా?

కలం, వరంగల్ బ్యూరో : పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ మున్సిపాలిటీ (Thorrur Municipality) ‘చే’ జారడంపై కాంగ్రెస్ నేతలు మదనపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిత్యం వహిస్తున్న మున్సిపాలిటీలో ఘోర పరాజయం చెందటం పట్ల పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. అత్తాకోడళ్ల (ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త జాన్సీ రెడ్డి) మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీ (Thorrur Municipality) పరిధిలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 10 వార్డులను గులాబీ పార్టీ గెలుచుకుంది. ఆరు వార్డులను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. తద్వారా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ అధిరోహించబోతోంది. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తొర్రూర్​ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ విజయం సాధించడం సంచలనంగా మారింది.

అత్తాకోడళ్లకు షాక్

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Yashaswini Reddy), ఏఐసీసీ నాయకురాలు ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) కి ఈ ఫలితాలు ఒకరకంగా గట్టి షాక్ ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీలో ఉన్న అంతర్గత పోరును పరిష్కరించడానికి వారిద్దరు ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Read Also: పట్టణ ఓటర్లూ కాంగ్రెస్ వైపే.. సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>