Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్యాన్స్​కు బిగ్​ షాక్​.. 2026లో మహేశ్, అల్లు అర్జున్ సినిమాలు లేనట్లేనా!

కలం, వెబ్​ డెస్క్​: సూపర్‌స్టార్ మహేశ్​ బాబు (Mahesh Babu), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు షాకిచ్చే వార్త ఇది. 2026లో టాలీవుడ్​ అగ్రహీరోలంతా తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతుంటే.. మహేశ్​, అల్లు అర్జున్​ మాత్రం ఈ ఏడాది బాక్సాఫీస్​ రేసులో కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. వీరు ప్రస్తుతం చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతుండటమే అందుకు ప్రధాన కారణం.

మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘వారణాసి’ (SSMB29) చిత్రంతో బిజీగా ఉన్నారు. దాదాపు రూ. 1000 కోట్లకుపైగా బడ్జెట్‌తో గ్లోబల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం రాజమౌళి ఎక్కువ సమాయాన్ని కేటాయించాడు. ఈ చిత్రం 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీంతో 2026లో మహేశ్​ నుంచి ఎలాంటి సినిమా విడుదల కావడం లేదని క్లారిటీగా తెలుస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) తన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2’ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టారు. ఈ పాన్-ఇండియా చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మేకింగ్ పరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతుండటంతో ఇది కూడా 2027లోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలిన స్టార్ హీరోలందరి సినిమాలు ఈ ఏడాది క్యూలో ఉన్నప్పటికీ, ఈ ఇద్దరు టాప్ హీరోలు మాత్రం సందడి చేయడం లేదు.

Read Also: పట్టణ ఓటర్లూ కాంగ్రెస్ వైపే.. సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>