Mobile Popup Ad
Mobile Popup Ad

జమ్మికుంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: జమ్మికుంట (Jammikunta) మండలం వావిలాల–వంతడుపుల గ్రామాల మధ్య విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 70 ఎకరాల మక్కా పంట దగ్ధమైంది. గోపాల్పూర్, వంతడుపుల గ్రామాలకు చెందిన పలువురు రైతులు సాగు చేసిన పంట పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని సూచించారు. జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. తూకం పేరుతో దళారులు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వెంట కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిల్ రమేశ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ జావిద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ పావని వెంకటేశ్ ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>