టిమ్స్ ఆస్పత్రి ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపు.. నేతల ముందస్తు అరెస్టులు

కలం, వెబ్ డెస్క్: సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని ( Sanathnagar TIMS Hospital ) వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్ నేతలు (BRS Leaders) , కార్యకర్తలను టిమ్స్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను ముందస్తుగా అరెస్టు చేయడంతో పాటు మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో కలిసి సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు ఆయన వెళ్లాల్సి ఉండగా, జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు చేరుకుని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

శంబీపూర్ రాజు హౌస్ అరెస్ట్

మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 5 గంటల నుంచే పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. సనత్‌నగర్ టిమ్స్ సందర్శనకు ఆయన వెళ్లనున్నారనే సమాచారంతోనే వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు.

పోలీసుల చర్యలపై శంబీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ప్రజల తరఫున కార్యక్రమం చేపడుతుంటే అడ్డుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ముట్టడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>