తిరుమలలో ఇక ఈ రైడ్స్ బంద్.. టీటీడీ కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్: తిరుమలకు ప్రైవేట్ యాప్‌ల ద్వారా బుక్ చేసే ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ టాక్సీ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను టీటీడీ పూర్తిగా నిషేధించింది (TTD Bans Bike Taxi). తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన సునీల్ శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతి ఎయిర్ పోర్టుకు ఒక ప్రైవేట్ యాప్ బైక్ రైడ్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్ పోర్టుకు వెళ్లే క్రమంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 26వ మలుపు వద్ద వేగంగా క్యాష్​ బారియన్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాపిడో బైకర్ అక్కడికక్కడే మృతిచెందగా.. సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద యాప్ ఆధారిత బైక్ రైడ్స్‌ను నిలిపివేయాలని నిర్ణయం (TTD Bans Bike Taxi) తీసుకుంది. ఇందులో భాగంగానే అలిపిరి తనిఖీ కేంద్రంలో ‘నాట్ ఎలౌడ్’ అనే పోస్టర్లను ఏర్పాటు చేశారు.

వ్యక్తిగత బైకులకు అనుమతి ఉంది

భక్తులు తమ సొంత బైకులపై తిరుమలతి కొండపైకి ప్రయాణించవచ్చు. కానీ సమయనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వన్యప్రాణుల రక్షణ, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్లలో బైకులకు అనుమతి ఉంటుందని తెలిపింది.

Also Read : శ్రీసిటీలో భారీ పేలుడు: నలుగురు కార్మికులు మృతి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>