కలం, నిర్మల్: బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుక (KTR Birthday) లను నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వృద్ధాశ్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము నేతృత్వంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు గండ్రత్ రమేష్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

