ఫ్యూచర్‌ సిటీ పేరుతో భూ దోపిడీ : మన్నె క్రిశాంక్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దోపిడికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట్లాడారు. నల్లధనాన్ని విదేశాలకు తరలించే కుట్ర చేస్తున్నారన్నారన్నారు.

డొల్ల షెల్ కంపెనీ పేర్లతో భూములు కేటాయించుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన సొంత తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో వందల కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. భూముల కేటాయింపు వ్యవహారంలపై విచారణ చేపట్టి.. భూముల కేటాయింపును రద్దు చేయాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.

Also Read : ట్రంప్‌తో సీఎం రేవంత్ భేటీ?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>