రిమ్స్ అగ్నిప్రమాదంపై రాజకీయాలు తగవు: బొజ్జు పటేల్

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై (RIMS Fire Tragedy) రాజకీయాలు చేయడం సరికాదని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) అన్నారు. గురువారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. ప్రమాదం అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు. విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ స్వలాభం కోసం బాధితుల ఆవేదనను రాజకీయ అంశంగా మార్చడం తగదని సూచించారు.

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామానికి చెందిన షేకు భాయి దంపతుల శిశువు రిమ్స్ అగ్నిప్రమాదంలో మృతి చెందడంపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల పరిహారం చెక్కును అందించారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>