కలం, వెబ్‌డెస్క్: భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటూ దేశాన్ని, కుటుంబాన్ని విడిచి వెళ్లిన ఆ యువకుడు కలలన్నీ తీరకుండానే అర్ధాంతరంగా పరాయి దేశంలోని తుది శ్వాస విడిచాడు. కొడుకు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చాడు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (US Road Accident) లో ఏపీలోని తిరుపతి (Tirupati) కి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లాలోని చిట్వేలి మండలం జెట్టివారిపల్లికి చెందిన దిలీప్ కుమార్ అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు.
ఐదు నెలల క్రితం దిలీప్ తిరుపతి నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగంలో చేరాడు. శనివారం ఉదయం కెన్నెట్ నగరంలో స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దిలీప్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో అమ్మాయి కోమాలోకి వెళ్లిపోయింది. మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై దిలీప్ కుమార్ తల్లిదండ్రులకు సమాాచారం అందింది. కొడుకు మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దిలీప్ స్వగ్రామం జెట్టివారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read : ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దోపిడీ : మన్నె క్రిశాంక్
Follow Us On : WhatsApp

