కలం, ఆలేరు: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆలేరు పట్టణం (KTR Alair)లో పండుగ వాతావరణం నెలకొంది. వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శుక్రవారం కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని జాతీయ రహదారిపైనే పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. కేటీఆర్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేటీఆర్ రాకతో ఆలేరు జాతీయ రహదారి పరిసర ప్రాంతాలు జై తెలంగాణ, జై కేటీఆర్ నినాదాలతో హోరెత్తాయి.

