రైతుల పాలిట రాక్షసంగా రేవంత్ సర్కార్: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర రైతుల పాలిట రేవంత్ సర్కార్ రాక్షసంగా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో సుమారు రూ. 29 వేల కోట్ల రైతుబంధు నిధులు ఎగ్గొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ  హయాంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాద అని.. రేవంత్ రెడ్డితెచ్చిన కరువేనని దుయ్యబట్టారు. ఈ మేరకు రైతు సమస్యలపై దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రైతు పొలికేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

కరోనాలోనూ రైతుబంధు ఇచ్చాం..

కేసీఆర్ అభివృద్ధి పాలనలో పదేళ్లకు చల్లగా ఉన్న రైతన్నలు.. నేడు రేవంత్ పాలనలో మళ్ళీ రోడ్లకెక్కాల్సిన దుస్థితి వచ్చిందని హరీశ్ రావు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ కేసీఆర్ రైతుబంధు ఇచ్చారని కొనియాడారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీ ఇవ్వకపోయినా రైతుబంధు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అయితే,  ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పిన మోసగాడు రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. కేంద్రం వడ్లు కోనట్లేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. ‘కేంద్రం వడ్లు కొనకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? చేతకాకపోతే కుర్చీ దిగిపో’.. అంటూ దుయ్యబట్టారు.

రైతుల గొంతు కోస్తున్న రేవంత్..

కేసీఆర్ హయాంలో  రైతు చనిపోతే దినవారాలు కాకముందే రూ. 5 లక్షల బీమా ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ వచ్చాక ఆ బీమాకు ప్రీమియం కట్టకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సాగుకు వాడే డీఏపీ, యూరియా ఎరువుల కోసం యాప్‌లు తెచ్చి రైతులను బజారున పడేస్తున్నారని మండిపడ్డారు.  తాము ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి.. బుడ్డ పిల్లర్ పేరుతో రైతుల గొంతు కోస్తున్నారని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>