Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ఎస్ తప్పులు తప్ప అభివృద్ధి చేయలే : వేముల వీరేశం

కలం, నల్లగొండ బ్యూరో : బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో అనేక తప్పులు చేసిందని, పైసా అభివృద్ధి పనులు చేయలేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) విమర్శించారు. అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేదవారికి విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం పారదర్శక ప్రజా పాలన అందిస్తుందని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే అసమానత్వం లేని సమాజ నిర్మాణానికి కృషి చేశారని వీరేశం (Vemula Veeresham) తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశారని పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>