కలం, వరంగల్ బ్యూరో : స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ (Flexi) ఆసక్తిగా మారింది. గత కొంతకాలంగా మాటల యుద్ధం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), మాజీ ఎమ్మెల్యే టీ. రాజయ్య ఫొటోలను ఒకే ఫ్లెక్సీలో పెట్టడంతో అది చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో కడియం శ్రీహరి ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు స్పీకర్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు ప్రాధాన్యం సంతరించకుంది. ఈ ఫ్లెక్సీలపై ఒకవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఫోటో, మరోవైపు మాజీ ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ఫోటోతో పాటు ‘స్వాగతం సుస్వాగతం’ అని రాసి ఉంది. సోషల్ మీడియాలో ఈ ఫ్లెక్సీల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కడియం శ్రీహరి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన లేఖలో తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ లేఖపై బీఆర్ఎస్ నేతలతో పాటు, రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల ఏర్పాటు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Read Also: ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎల్పీ మీటింగ్‌కు వస్తారా?
Follow Us On: Instagram


