Mobile Popup Ad
Mobile Popup Ad

కౌడిపల్లిలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేత

కలం, వెబ్‌డెస్క్: మెదక్ (Medak) జిల్లాలోని కౌడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించేందుకు బీఆర్ఎస్ నేతలు ఆదివారమే జెండా గద్దెను అలంకరించి రంగులు వేసినట్లు తెలిపారు. అయితే అర్ధరాత్రి సమయంలో జెండా గద్దెను కూల్చి వేశారు. ఇది కాంగ్రెస్ నాయకుల పనే అయి ఉంటుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గద్దెను కూల్చిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కౌడిపల్లి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>