Mobile Popup Ad
Mobile Popup Ad

ఎర్రవల్లి నుండి హైదరాబాద్‌కు కేసీఆర్‌

క‌లం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎర్రవల్లి నివాసం నుండి హైదరాబాద్‌కు పయనమయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.

మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ వేడుకల కోసం పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, పార్టీ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ నిర్వహించే ఈ ముగింపు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు ఇప్పటికే భారీగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. రాబోయే రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో అధినేత దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

కేసీఆర్ నివాసంలో నీటి కొర‌త‌..

మాజీ ముఖ్య‌మంత్రి నివాసానికి కూడా నీటి కొరత సెగ తగిలింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ఆయన హైదరాబాద్ చేరుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితి వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ రాకను పురస్కరించుకుని ఆయన నివాసంలో అవసరాల కోసం సిబ్బంది ముందస్తుగా వాటర్ ట్యాంకర్‌ను తెప్పించారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద నీటి ట్యాంకర్ కనిపిస్తుండటంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>