కార్పొరేటర్‌కు రెండు పెళ్లిళ్లు.. అఫిడవిట్‌లో దాచేశాడు!

కలం, ఖమ్మం బ్యూరో: ఎన్నికల అఫిడవిట్‌లో రెండు పెళ్లిళ్ల విషయం దాచిపెట్టి ఎలక్షన్ కమిషన్‌ను మోసం చేశాడు ఓ కార్పొరేటర్. వివరాళ్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌లో 29వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరపున మల్హోత్రా సాగర్ నామినేషన్ వేశాడు. అతను సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడక అంటూ ఆరోపిస్తూ సీపీఐ అభ్యర్థి మాచర్ల శ్రీనివాస్ అదనపు కలెక్టర్ వేణు‌గోపాల్‌కు ఫిర్యాదు చేశారు. అఫిడవిట్‌లో ఒక భార్య, ముగ్గురు సంతానం అని పేర్కొనడం అవాస్తవమని ఆరోపించారు. రెండో భార్య ఉష‌కు జన్మించిన కుమారుడి బర్త్ సర్టిఫికెట్‌లో తండ్రి పేరు మల్హోత్రా సాగర్ అని స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల అఫిడవిట్‌ (Affidavit)లో కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా ప్రకటించాలి. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ఉద్దేశపూర్వకంగానే సీక్రెట్‌గా ఉంచారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిజాలను బహిర్గతం చేయాలని మాచర్ల శ్రీనివాస్ (సీపీఐ), తవ్వా వాణి రెడ్డి (కాంగ్రెస్) అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

 Read Also: ధ‌ర‌ణి దోపిడీపై పొంగులేటి ఉక్కుపాదం.. అధికారులకు కీలక ఆదేశాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>