epaper
Wednesday, February 18, 2026
epaper

బాల్క సుమన్ అరెస్ట్​

కలం, వెబ్​ డెస్క్​ : మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో (Kyathanpally Municipality) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గొడవలకు సంబంధించి, మంత్రి వివేక్​ కాన్వాయ్​ పై దాడి కేసు నేపథ్యంలో, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు సుమన్​ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు లోపలికి వెళ్లకుండా బీఆర్​ఎస్ కార్యకర్తలు ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్​ఎస్​ కార్యకర్తలను చెదరగొట్టిన అనంతరం తీవ్ర ఉత్కంఠ నడుమ పోలీసులు బాల్క సుమన్‌ ను అరెస్టు చేశారు.

తీవ్ర ఉద్రిక్తత, కార్యకర్తల ఆందోళనల మధ్య బాల్క సుమన్‌ను (Balka Suman) అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షలు ముగిసిన అనంతరం, ఆయనను రామగుండం జడ్జి నివాసంలో హాజరుపరచనున్నారు. రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఈ కేసులో బాల్క సుమన్‌ను ప్రధాన నిందితుడిగా (A1), మూల రాజీరెడ్డిని రెండో నిందితుడిగా (A2) చేర్చారు.

 Read Also: కేంద్రానికి తమిళనాడు సీఎం సంచలన డిమాండ్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>