పొన్నం, హరీష్‌, రఘునందన్ ముందే కార్యకర్తల గొడవ.. తీవ్ర ఉద్రిక్తత

కలం, వెబ్ డెస్క్ : సిద్దిపేటలోని నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ ఎస్ (BRS) పార్టీల కార్యకర్తలు ఒకేచోటకు చేరడంతో పరస్పర నినాదాలతో హోరెత్తించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే హరీష్‌ రావు, ఎంపీ రఘునందన్ రావు వేదిక వద్దకు వస్తున్నప్పుడు కార్యకర్తలు పరస్పర నినాదాలు, వాదనలతో రెచ్చిపోయారు. స్టేజిమీదకు ఎక్కిన తర్వాత కూడా కార్యకర్తలు ఎంతకూ తగ్గలేదు. మూడు పార్టీల కేడర్ ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో పొన్నం ప్రభాకర్, హరీష్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యకర్తలకు హరీష్‌ (Harish Rao), పొన్నం (Ponnam Prabhakar) వార్నింగ్ ఇచ్చినా సరే ఎవరూ వినిపించుకోలేదు. సైలెంట్ గా ఉండాలని హరీష్‌, పొన్నం, తుమ్మల కోరినా సరే ఏ ఒక్కరూ తగ్గకుండా గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. దీంతో చాలా సేపు స్టేజి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. రాజకీయాలకు ఇది వేదిక కాదని, ప్రభుత్వంపై, రైతులపై గౌరవం ఉంటే సైలెంట్ గా కూర్చోవాలని మూడు పార్టీ లీడర్లు చెప్పినా సరే ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు అందరినీ కంట్రోల్ చేయాలని మంత్రులు ఆదేశించగా.. చాలా సేపు తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Read Also: సీఎం మరో శుభవార్త.. సాదా బైనామా భూములకు త్వ‌ర‌లో పరిష్కారం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>