కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో 58 మందితో కాంగ్రెస్(Congress) కార్యవర్గాన్ని ఆమోదిస్తూ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌సీ బి. మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Makkan Singh Raj Thakur) ప్రతిపాదించిన పేర్లను ఆమోదించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్దపల్లిలోనే తొలిసారిగా జిల్లా కార్యవర్గం ప్రకటించినట్లు సమాచారం.
జిల్లా ఉపాధ్యక్షులుగా దీటి బాలరాజు, హనుమంతరెడ్డి, మారెల్లి రాజిరెడ్డి, ఎం.డి. మునీర్, అర్షనపెల్లి వెంకటేశ్వర రావు, చొప్పరి సదానందం నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా ఇసంపెల్లి అంజుల్, సనా ఫక్రుద్దీన్, పూరడి సత్తయ్య గౌడ్, పర్శవేని శ్రీనివాస్, ఎండి అబ్దుల్ మోబిన్, దేవరకొండ రాజు, కొమ్ము శ్రీనివాస్, కసిరెడ్డి మహేందర్ రెడ్డి, గంగిరెడ్డి తిరుపతి రెడ్డి, నర్సింగ రావు, తోట చంద్రయ్య, సూర సమ్మయ్య నియమితులయ్యారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కోశాధికారి పదవికి చిదురాల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధులుగా పెండ్యాల మహేష్, బైరి రవి గౌడ్, సగ్గెం రాజేష్, మోహిద్ సన్ని, జిల్లా కార్యదర్శులుగా గాదె సుధాకర్, వాసుదేవ రావు, అనుమ సత్యనారాయణ, కరెంగల రమేష్, తిర్తల వీరయ్య, రవి సదానందం, ఎర్ర రాజిరెడ్డి, పూరడి రాజేందర్ గౌడ్, పి.శంకర్, కొత్త నర్సింహం, ఇల్లి శ్రీనివాస్, చంద్రమౌళి, బుద్దర్తి బుచ్చయ్య, గాండ్ల మోహన్, కటకం రవీందర్, ఇప్తికర్ నియమితులయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా మేకల శ్రీనివాస్, సుతారపు పరమేష్, మిట్టపల్లి శ్రీకాంత్, శ్రీకొండ కొమురయ్య, కవ్వంపల్లి స్వామి, మాదాసు సతీష్, చెరుకు బుచ్చి రెడ్డి, చుక్కల శ్రీనివాస్, ఎండి. హమీద్, బొడిగె భరత్ గౌడ్, కొత్తపల్లి రాజు, మంచినీళ్ల భాస్కర్, మద్దుపు మధు, నేరెడ్ల ఓదెలు, తాళ్లపల్లి కుమార్, కటకం సత్యం, కుందారపు బాపు, సవ్వ శంకర్, నాగెల్లి జానీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Read Also: టాటూ వేయించుకుంటున్నారా..? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ ఫ్యాక్ట్స్
Follow Us On: Instagram

