ఓల్డ్ టీఆర్ఎస్ టు న్యూ టీఆర్ఎస్.. ఫ్యామిలీ ప్యాక్ పోస్టులు

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి ఒక రాజకీయ పార్టీగా కల్వకుంట్ల ఫ్యామిలీ చేతుల్లోనే ఉన్నది. ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కొనసాగుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోగినపల్లి సంతోష్‌రావు (కేసీఆర్ సడ్డకుడి కొడుకు) వ్యవహరిస్తున్నారు. పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా (BRS) మారుస్తూ పార్టీ ప్లీనంలో జరిగిన నిర్ణయం మేరకు 2022 డిసెంబరు 9న కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ చేతుల్లోనే ఉన్నది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kavitha) ఇటీవల తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నది. ప్రజల నుంచి అభ్యంతరాలను కోరుతూ పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల చివరకు గడువు ముగిసిన అభ్యంతరాలను పరిశీలించి ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇవ్వనున్నది.

కవిత కుటుంబ సభ్యుల చేతుల్లోనే పార్టీ :

కేసీఆర్ కుటుంబం చేతుల్లో బీఆర్ఎస్ (BRS) ఉన్నట్లుగానే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఫ్యామిలీ చేతుల్లోనే తెలంగాణ రక్షణ సేన (TRS) కొనసాగనున్నది. పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులన్నీ ఆ కుటుంబ సభ్యులకే. పార్టీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శిగా ఆమె భర్త దేవనపల్లి రామయ్యగారి అనిల్ కుమార్, కోశాధికారిగా దేవనపల్లి రామయ్యగారి అరుణ్ కుమార్ వ్యవహరించనున్నారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ మాత్రం లకావత్ రూప్‌సింగ్ పేరును ఆ ప్రకటనలో పార్టీ పేర్కొన్నది. ప్రస్తుతానికి కార్యవర్గంలో ఐదుగురు ఉంటే వైస్ ప్రెసిడెంట్, జాయింట్ ట్రెజరర్ పోస్టుల్ని మాత్రం ఇతరులకు ఇచ్చిన టీఆర్ఎస్.. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టుల్ని మాత్రం కవిత (Kavitha), ఆమె భర్త, కుటుంబ సభ్యులనే నియమించుకున్నది. బీఆర్ఎస్ తరహాలోనే టీఆర్ఎస్ కూడా ఫ్యామిలీ పార్టీగానే కొనసాగనున్నది.

Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>