Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. మల్లన్న సాగర్ కెనాల్‌లో మునిగి అక్కాతమ్ముడు మృతి

కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని మల్లన్న సాగర్ (Mallanna Sagar) కెనాల్‌లో మునిగి అక్క, తమ్ముడు మృతి చెందారు. ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో సరదా కోసం కెనాల్ వద్దకు వెళ్లారు. ఇద్దరు సరదాగా ఈత కొట్టాలనుకున్నారు. రిషిత (13), మనీశ్ (9) ఈత కొట్టే ప్రయత్నం చేశారు. లోతును అంచనా వేయకుండా కెనాల్‌లోకి దిగడంతో అక్క, తమ్ముడు గల్లంతయ్యారు. పోలీసుల సహాయంతో గ్రామస్తులు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>