కలం, వెబ్‌డెస్క్: జపాన్ నుంచి నేతాజీ (Netaji Subhas Chandra Bose) అవశేషాలు భారత్‌కు తెప్పించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన ముని మనవడు చంద్ర కుమార్ బోస్ గురువారం లేఖను రాశారు. లేఖలోని సారాంశం ఏంటంటే.. దేశ స్వతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ను సింగపూర్‌లో నేతాజీ స్థాపించి 8 దశాబ్దాలు దాటిన సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 21న ఘనంగా జరుపుకున్నాం. ఈ క్రమంలో ఢిల్లీలో ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్మారకాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది.
బ్రిటీష్ పాలనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆ స్మారకంలో చోటు కల్పించనున్నందున.. అందులో నేతాజీ (Netaji Subhas Chandra Bose) అవశేషాలకూ చోటు కల్పించాలి. అందువల్ల జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ టెంపుల్లో భద్రంగా ఉన్న నేతాజీ అవశేషాలను తీసుకురావాలని విజ్క్షప్తి చేస్తున్నాను. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అవశేషాలు భారత్‌కు తీసుకురావాలని ఇప్పటికే అనేక సార్లు ఆయన కుమార్తె, ప్రొఫెసర్ అనిత బోస్‌తో సహా ఇతర కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మాతృభూమికి నేతాజీ అవశేషాలు తీసుకురాలనేది మా అందరి కోరిక. కాబట్టి ఈ విషయంలో మీరు సానుకూలంగా స్పందించి, నేతాజీ అవశేషాలను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నాను అని చంద్ర కుమార్ బోస్ తన లేఖలో రాష్ట్రపతికి విన్నవించారు.
Read Also: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
Follow Us On: X(Twitter)


