సంగారెడ్డిలో సైనిక సంక్షేమ భవనం ఏర్పాటు: బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డిలో సైనిక సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తామ‌ని తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు (Brigadier NR Babu) స్ప‌ష్టం చేశారు. జిల్లా కలెక్టర్ భూమి ఇచ్చిన వెంటనే భవనం నిర్మాణం కోసం గవర్నర్ ఆధ్వర్యంలో సాయుధ దళాల పతాక ఫండ్ నుండి డబ్బును మంజూరు చేయించి నిర్మాణ పనులు చెప్పడతామని తెలియజేశారు. అదే విధంగా సంగారెడ్డిలో ఈసీహెచ్ఎస్ పాలీ క్లినిక్, క్యాంటీన్‌ల కోసం సంబంధిత ఆర్మీ అధికారులతో మాట్లాడి వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. బుధ‌వారం సంగారెడ్డి ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాన్ని ఎన్ఆర్ బాబు సందర్శించారు.

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి నేరుగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సైనిక సంక్షేమ భవనాలు ఏర్పాటు చేశారని, ఒక్క సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనే లేదని చెప్పారు. ఇక్క‌డ కూడా ఏర్పాటు చేస్తే మాజీ సైనికులకు, సర్వీస్‌లో ఉన్న సైనికులకు ఉపయోగ‌ప‌డుతుంద‌న్నారు. ఎవ‌రైనా అనారోగ్యానికి గురైతే హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వస్తుందని, ఈసీహెచ్ఎస్ పాలి క్లినిక్‌ కూడా సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలని ఆయ‌న (NR Babu) వెల్ల‌డించారు. అదేవిధంగా డీజీఆర్ వేతనాల సవరణ చేయాలని, మాజీ సైనికులకు వ్యవసాయ భూమి, గృహ స్థలాల కేటాయింపు చేయాలని కోరారు. అసైన్డ్ భూములకు ఎన్‌వోసీ మంజూరు చేయాలని, ప్రభుత్వ నియామకాల్లో 2 శాతం రిజర్వేషన్‌ను కనీసం 10 శాతానికి పెంచాలని మాజీ సైనికులు కోరారు.

Read Also: దుబ్బాకను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>