హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అంతర్జాతీయ మీడియాలోనూ ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. బ్రెజిల్‌కు చెందిన మోడల్ లారిసా నెరీ(Larissa Nery) కు హర్యానాలో ఓటు హక్కు ఉందని.. మొత్తం 22 చోట్ల ఆమెకు వివిధ పేర్లతో ఇక్కడ ఓటు ఉందని వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఈ ఆరోపణలు తీవ్రమైన దుమారం రేపాయి. కాగా సదరు మోడల్ తాజాగా స్పందించారు. తనకు సంబంధం లేకపోయినా తనను ఓ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారని ఆమె ప్రశ్నించారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో తన పేరు ఉండటంతో ఆమె ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
రాహుల్ గాంధీ చూపించిన బ్రెజిల్ మోడల్ పేరు లారిసా నెరీ(Larissa Nery) అని తేలింది. తాజాగా ఆమె స్పందించారు. తాను భారతదేశానికి సంబంధం లేని వ్యక్తినని ఆమె స్పష్టం చేశారు. ఆ ఫొటో తాను 18–20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీసుకున్నదని గుర్తు చేశారు. ఎవరైనా స్టాక్ ఇమేజ్ సైట్ నుంచి కొనుగోలు చేసి వాడి ఉంటారు. తనను భారతీయురాలిగా చూపించడం, ఓటు స్కామ్‌లో భాగం చేయడం పూర్తిగా పిచ్చితనం” అని లారిసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
రాహుల్ ప్రెస్‌మీట్‌తో లారిసా నెరీ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఆమె వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేశారు. తన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఫోన్లు చేస్తూ, ఇంటర్వ్యూలు కోరుతున్నారని ఆమె తెలిపింది. “ఇలాంటి వార్తల్లో నేను ఉండటం నమ్మలేకపోయాను. నేను బ్రెజిల్‌లో నివసిస్తున్న డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మాత్రమే” అని వివరించారు.
హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల నకిలీ ఓట్లు నమోదు అయ్యాయని రాహుల్ ఆరోపించారు. వాటి కారణంగానే బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లారిసా ఫోటోను చూపిస్తూ “ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో హరియాణాలో 22 సార్లు ఓటు వేసింది. ఎన్నికల సంఘం దీనిని గుర్తించలేదా?” అని ప్రశ్నించారు. ఈ వివాదంపై ఎన్నికల సంఘం స్పందిస్తూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను “నిరాధారాలు”గా అభివర్ణించింది. ఓటర్ జాబితా పర్యవేక్షణలో కాంగ్రెస్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొంది.
Read Also: బండి సంజయ్ మీటింగ్‌కు నో పర్మిషన్..
Follow Us on: Youtube

