నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు!

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court)కు బాంబు బెదిరింపు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. వెంట‌నే పోలీసులు కోర్టుకు చేరుకొని త‌నిఖీలు చేప‌ట్టారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్‌ కోర్టు మొత్తం చెక్ చేస్తున్నారు. న్యాయ‌వాదులు, కోర్టు సిబ్బందిని బ‌య‌ట‌కు పంపి త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. గతంలో సైతం కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మరోవైపు ఏపీలోని రాజమండ్రి జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యాయమూర్తులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా గాలిస్తున్నారు.

Read Also: అర్హులందరికీ అక్రిడేషన్​ కార్డులు : ఐఅండ్​పీఆర్​ స్పెషల్​ కమిషనర్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>