epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎయిర్​పోర్ట్​కు మళ్లీ బాంబు బెదిరింపు

కలం, వెబ్​డెస్క్​: శంషాబాద్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి​ ​(Shamshabad Airport) బాంబుల బెదిరింపు ఆగడం లేదు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల్లో ఇప్పటికే ఆరింటికి బాంబు బెదిరింపు(Bomb Threat) మెయిల్స్​, కాల్స్​ రాగా తాజాగా మంగళవారం మరో బెదిరింపు మెయిల్​ వచ్చింది. మిలియన్​ డాలర్లు ఇవ్వకుంటే అమెరికా వెళ్లే ఓ విమానం పేలిపోతుందంటూ మెయిల్​ వచ్చింది. దీంతో సీఐఎస్​ఎఫ్​ బృందం.. ఎయిర్​పోర్ట్​ భద్రతా సిబ్బందితో కలసి విస్తృత తనిఖీలు చేసింది. కార్గో జోన్స్​, పార్కింగ్​ ఏరియాలతో పాటు షెడ్యూల్​ అయిన అన్ని విమానాలనూ క్షుణ్నంగా సోదా చేసింది. ప్రయాణికులను సైతం మరో దఫా తనిఖీ చేసింది.

అయితే, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. మరోవైపు సైబర్​ సెక్యూరిటీ అధికారులు బెదిరింపు మెయిల్ అమెరికా నుంచి జస్పర్​ అనే వ్యక్తి పేరుతో వచ్చినట్లు గుర్తించారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒకవైపు ఇండిగో సంక్షోభం కొనసాగుతుండగా మరోవైపు ఇలా తరచూ బాంబు బెదిరింపులు రావడం ప్రయాణికులకు, భద్రతా సిబ్బందికి చికాకుగా మారింది. ఈ నెల5న, 6న, 8న సైతం శంషాబాద్​ ఎయిర్​పోర్ట్ ​(Shamshabad Airport)​ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆరు విమానాలకు బెదిరింపు మెయిల్స్​, కాల్స్​ వచ్చాయి. రాజధానిలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్​ సమ్మిట్​ జరుగుతుండగా ఎయిర్​పోర్ట్​కు ఇలా వరుసగా బెదిరింపులు వస్తుండడంతో అధికారుల్లో టెన్షన్​ నెలకొంది.

Read Also: సల్మాన్ ఖాన్ వెంచర్స్ ధమాకా: ఫ్యూచర్ సిటీలో 10 వేల కోట్ల పెట్టుబడి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>