కలం, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ (Kavya Maran), స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి హడావిడే నడుస్తోంది. నవంబర్ 11న గ్రీస్‌లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఈ జంట తర్వాత ఇండియాకు వచ్చి రాజకీయ నాయకులకు, సినీ తారలకు, బిజినెస్ టైకూన్లకు పార్టీలు ఇస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సన్ నెట్‌వర్క్ ఉద్యోగులకు కూడా కావ్య, అనిరుధ్ ఒక స్పెషల్ వెడ్డింగ్ రిసెప్షన్ లంచ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కావ్యా సన్ గ్రూప్ సిబ్బంది అందరికీ పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు ఒక బంగారు ఉంగరాన్ని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అందించి తమ ఆనందాన్ని వారితో పంచుకున్నారు. డబ్బు ఉండటం వేరు, కానీ తమ సంతోషాన్ని ఉద్యోగులతో కూడా పంచుకునే గొప్ప మనసు ఉండటం గ్రేట్ అంటూ నెటిజన్లు కావ్యాపై ప్రశంసలు కురిపించారు.
ఇక సన్ గ్రూప్ ఉద్యోగులకు ఇచ్చిన ఈ విందులో అతిథుల కోసం అదిరిపోయే నాన్-వెజ్, వెజ్, స్వీట్ మెనూను ఏర్పాటు చేశారు. ఈ మెనూలో మటన్ బిర్యానీ, మటన్ సుక్కా, చికెన్ లెగ్ పీస్ కర్రీ, రొయ్యల వేపుడు, కౌజు పిట్ట, ఎగ్ మసాలాతో పాటు కర్డ్ ఆనియన్, వంకాయ కూర వడ్డించారు. అలాగే భోజనం తర్వాత స్వీట్లలో భాగంగా బ్రెడ్ హల్వా, పాయసం, గులాబ్ జామూన్, ఐస్ క్రీమ్‌లతో ఉద్యోగుల నోరు తీపి చేశారు. ఈ పార్టీకి అనిరుధ్, కావ్యా కూడా స్వయంగా అటెండ్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

