కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) రూరల్ మండలం తల్వేద గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ (BJP) జిల్లా కార్యాలయ భవనాన్ని.. ఈ నెల 28న ప్రారంభించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హాజరుకానున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని బీజేపీ పదాధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రితీష్ రాథోడ్ పిలుపునిచ్చారు.

