కలం వెబ్ డెస్క్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ గురించి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటాలనుకుంటుందని చెప్పారు. జనసేనతో (Janasena) పొత్తుపై స్పందిస్తూ ఏపీలో రాజకీయ పరిస్థితులు వేరు అని, దానికి సానుకూలంగా అక్కడ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఇక ఏ నిర్ణయం అయినా జాతీయ పార్టీయే తీసుకుంటుందని వెల్లడించారు.
శనివారం మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) పోటీపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటారని అంతా భావించారు. కానీ, బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉంటుందని రామచందర్ రావు వెల్లడించారు. ఏపీలో జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రెండు పార్టీలో కలిసే ఉంటాయన్న ఊహాగానాలున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణ బీజేపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీలు విడివిడిగా పోటీలో ఉంటాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు పొత్తుల వ్యవహారంపై పార్టీ అధినేతదే తుది నిర్ణయమని జనసేన నాయకులు పేర్కొంటున్నారు.
Read Also: సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)


