కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీ (BJP) కి వ్యతిరేకంగా ఓటు వేసిన ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ పై అధిష్ఠానం వేటు (Suspends Councillors) వేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీలోని 18వ వార్డు మెంబర్ చెట్లపల్లి మీన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి విప్ ను ధిక్కరించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన మీన భర్త సుఖేందర్ గౌడ్ ను కూడా సస్పెండ్ చేసింది.
Read Also: నిశాంక అజేయ సెంచరీ.. ఆస్ట్రేలియాకు ‘సూపర్’ గండం
Follow Us On: X(Twitter)


