ఉప్ప‌ల్ స్టేడియంలో క్రికెట్‌ ఫ్యాన్స్ క‌ష్టాలు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఉప్ప‌ల్ స్టేడియం (Uppal Stadium) వేదిక‌గా జ‌రుగుతున్న‌ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (LSG vs SRH) మ్యాచ్‌కు ఫ్యాన్స్ తీవ్ర ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. స్టేడియం మేనేజ్‌మెంట్ క‌నీస ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు కూడా తీసుకోలేద‌ని విమ‌ర్శిస్తున్నారు. అది క్రికెట్‌ స్టేడియమా లేదా పాడుబడ్డ గోడౌనా అన్న‌ట్లుగా మారింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స్టేడియంలో వీక్ష‌కులు కూర్చునే సీట్ల‌న్నీ దుమ్ముతో నిండిపోయాయి. క‌నీసం మ్యాచ్ ఉన్న‌ప్పుడైనా స్టేడియం క్లీన్ చేయించాల‌ని క‌దా అంటూ ఫ్యాన్స్ అధికారుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. సీట్ల‌పై దుమ్ము బాగా పేరుకు పోవ‌డంతో త‌మ క‌ర్చీఫ్‌ల‌తో సీట్ల‌ను క్లీన్ చేసుకుంటున్నారు.

మరోవైపు మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం (Uppal Stadium) వ‌ద్ద తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. స్టేడియంలోకి పర్సులు, బ్లూటూత్, స్మార్ట్ వాచ్‌లను అధికారులు అనుమ‌తించ‌లేదు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికిప్పుడు అవి లేకుండా లోపలికి ఎలా వెళ్తామంటూ ఆందోళనకు దిగారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వాలెట్, స్మార్ట్ వాచ్‌లను ఎక్కడ పెట్టాలంటూ నిలదీశారు. గతంలో వాలెట్‌ని అనుమతి ఇచ్చి.. ఇప్పుడెందుకు ఆంక్షలు విధిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. స‌న్ గ్లాసెస్‌ని కూడా లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో కొంద‌రు వాటిని బ‌య‌టే వ‌దిలేసి వెళ్లారు.

Read Also: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి 5 కిలోల సిలిండర్లు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>