కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా శివ్వంపేట మండలానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి (Brahmanapalli) రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ కోరారు. ఈ మేరకు బ్రిడ్జి నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వే, రైల్ నిలయం సికింద్రాబాద్ లో రైల్వే జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ కు సమస్యను వివరించి ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన వినతి పత్రంను అందజేశారు. ఎన్నో ఏండ్లుగా నర్సాపూర్ – గజ్వేల్ నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రైల్వే జనరల్ మేనేజర్ అతి త్వరలో సమస్యను పరిశీలించి, బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

