కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్ (Vijay)కి బీజేపీ భారీ ఆఫర్లు ప్రకటించినట్లు టీవీకే జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ (Aadhav Arjuna) వెల్లడించారు. ఇప్పటికే విజయ్‌కి 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి ప్రకటించారని, దీన్ని విజయ్ సున్నితంగా తిరస్కరించాని సోషల్ మీడియాలో చర్చ సాగింది. దీనిపై ఆదవ్ అర్జున్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ విజయ్‌కి 90 సీట్లు ఇస్తామని చెప్పిందని వెల్లడించారు. అంతే కాకుండా రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తామని కూడా చెప్పినట్లు తెలిపారు. ఢిల్లీకి బానిసగా ఉండే సీఎం పదవి తనకు వద్దని విజయ్ తిరస్కరించారని చెప్పారు.
తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 23న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులు, సీట్ల పంపకాలపై కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే (TVK) కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీకేతో పొత్తు కోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ (Vijay) మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ఆఫర్లకు విజయ్ అంగీకరిస్తాడా? లేక సింగిల్‌గానే బరిలో నిలుస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: ఎకరానికి కోటి.. కేంద్ర సర్కార్ బంపర్ ఆఫర్
Follow Us On: Youtube

