Mobile Popup Ad
Mobile Popup Ad

ఎకరానికి కోటి.. కేంద్ర సర్కార్ బంపర్ ఆఫర్

కలం, తెలంగాణ బ్యూరో : అభివృద్ధి ప్రాజెక్టులకు భూ సేకరణ సమస్యాత్మకంగా మారిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. భూములను సేకరించేటప్పుడు బాధితులకు, నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం సంతృప్తికరంగా లేకపోవడం, తక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం, పునరావాసం కల్పించకపోవడం.. ఇలాంటి సమస్యలతో ప్రజల్లో ఆందోళన నెలకొంటున్నది. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భవ్య (BHAVYA) అనే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నది. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పేరుతో పిలిచే ఈ పథకం ద్వారా ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను నెలకొల్పాలనుకుంటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయా ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్టుల (ఇండస్ట్రియల్ పార్కుల) ఎంపిక ఛాలెంజ్ మోడల్‌లో ఉండనున్నది.

ఆరేళ్లలో వంద ఇండస్ట్రియల్ పార్కుల టార్గెట్ :

దేశవ్యాప్తంగా సుమారు 34 వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటున్నది. రానున్న ఆరేండ్ల కాలంలో (2026-27 నుంచి 2031-32 వరకు) కనీసంగా 100 ఇండస్ట్రియల్ పార్కుల్ని నెలకొల్పాలనుకుంటున్నది. ఒక్కో ఇండస్ట్రియల్ పార్కుకు కనీస స్థాయిలో 100 ఎకరాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 33,600 కోట్లను కేటాయిస్తున్నది. భూమి ధర ఒకవేళ ఎకరానికి కోటి రూపాయలకంటే ఎక్కువ ఉన్న పక్షంలో గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం రూ. కోటిని సమకూరుస్తుంది. మిగిలినదాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు ప్లేయర్లు భరిస్తాయి. ఇన్వెస్ట్ మెంట్ రెడీ ప్లగ్ అండ్ ప్లే సౌకర్యలతో నిర్మాణమయ్యే ఈ ఇండస్ట్రియల్ పార్కులు అటు ఆత్మనిర్భర భారత్ స్కీమ్‌లో స్వయంసమృద్ధిగా ఉండడంతో పాటు ఉపాధి కల్పన, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఉంటాయని కేంద్ర క్యాబినెట్ పేర్కొన్నది.

Read Also: 2029లో తెలంగాణ ఎలక్షన్స్.. కాంగ్రెస్‌కు ప్లస్‌ అయ్యేనా?

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>