కలం, నిర్మల్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం (BJYM) ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ తలపెట్టింది. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో విద్యార్థుల సంతకాల సేకరణ చేపట్టారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దొడ్డికింది నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందాల్సిన రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను ప్రభుత్వం అందించకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. సుమారు రూ.15 వేల కోట్ల మేర బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ సూరజ్ నాయక్, నాయకులు సాత్విక్, కందుల హరీశ్, వెంకటేశ్, భరత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, శ్రీకాంత్, మధు, ప్రణయ్, నాగరాజు పాల్గొన్నారు.

