Mobile Popup Ad
Mobile Popup Ad

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందని చెప్పారు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇప్పటికే తొలి విడతలో ఇళ్ల మంజూరు చేయగా.. మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు.

రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి పొంగులేటి (Ponguleti) చెప్పుకొచ్చారు. జూన్-జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయన్నారు. అటు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామన్న మంత్రి.. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: కోమటిరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>